
– నిరుపేదలకు అండగా నేనున్నాన్నానంటూ భరోసా
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, మాడుగుల పల్లి మండలం, గజలాపురం గ్రామానికి చెందిన భట్టు దేవకమ్మ గత కొన్నాళ్లుగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. పేదకుటుంభం కావడం తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకొని సోమవారం బాధితురాలి ఇంటికి వెళ్లి పారామర్శించి వారి కుటుంబానికి బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి ఆర్థిక సహాయం అంద జేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య,మాజీ యంపిపి తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి,ఇందిర, లక్ష్మారెడ్డి,కూన్ రెడ్డి సంతోష్ రెడ్డి,గజ్జల శివానంద రెడ్డి,గజ్జల నాగార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు,యువత తదితరులు పాల్గొన్నారు.