పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలి..

– తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, కార్యదర్శి గొంది రాజేష్
– అటవీశాఖ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ – తాడ్వాయి
పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, కార్యదర్శి గొంది రాజేష్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఆ రేంజ్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న తునికాకు సేకరణ దారులు, తునిక కూలీలతో ధర్నా నిర్వహించారు. అనంతరం సెక్షన్ ఆఫీసర్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్ మాట్లాడుతూ గత సంవత్సరం 2023 ఫిబ్రవరి నెల చివరి వరకు 2016 నుండి 2023 వరకు పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ సేకరణ దారులకు అందరికీ చెల్లిస్తామని రాష్ట్ర సిసిఎఫ్ గారు హామీ  ఇచ్చారు. కానీ సంవత్సరం నర దాటినా కూడా ఇప్పటివరకు సగం మంది లబ్ధిదారులకు కూడా బోనస్ అందలేదు అని మండిపడ్డారు. బోనస్ వేసిన వాళ్లకు కూడా పూర్తి గా వెయ్యలేదు, కస్టపడి ఆకు సేకరించిన వాళ్లకు డబ్బులు జమ కాలేదని లబ్ధిదారులు ఆవేదన చెండుతున్నారు. తునికాకు డబ్బులు కూడా కొంత మందికి జమ కాలేదని లబ్ది దారులు అంటున్నారని అన్నారు. రా నున్న పది రోజులలో తునికాకు బోనస్ లబ్ది దారులందరికి జమ చేస్తామని సెక్షన్ ఆఫీసర్ అన్నారు అని అన్నారు. తునికాకు సేకరణ దారులకు న్యాయంగా చెందాలసిన బోనస్ డబ్బులు ఒక్కరూపాయి తేడా లేకుండా జమ చెయ్యాలని అదేవిదంగా 50 ఆకుల కట్టకు ఎంత బోనస్ చెల్లిస్తున్నారో చెప్పాలని లేకపోతే పోరాటాలు ఉదృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు అలెం అశోక్, చింత భాస్కర్, సిఐటియు మండల అధ్యక్షులు చిట్టీనేని శ్రీనివాస్, కార్యదర్శి కాటా నర్సింగ రావు, లబ్ధిదారులు బచ్చల వవెంకటేశ్వర్లు , తాటి వినయ్ ,తాటి కుశన్,మంకిడి సాంబాలక్ష్మి, గుండెబోయిన స్వరూప, నాలి పెద్దక్క, నాలి. సూరమ్మ, నాలి చిన్న లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.