విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేత..

నవతెలంగాణ – రెంజల్ 

ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏ క రూప దుస్తులను అందజేయడం జరుగుతుందని, ఎంపీపీ రజిని కిషోర్, ఎంపీడీవో శ్రీనివాసులు సూచించారు. సోమవారం రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలను, ఏకరూప దుస్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెంజల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు నాలుగు కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి 3900 డ్రెస్ లను పూర్తి చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయడం జరుగుతుందని మండలానికి 16 వేల పుస్తకాలు ప్రస్తుతం పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని పాఠశాలల్లో కి తీసుకువెళ్లాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ గణేష్ రావు, పి ఆర్ టి యు మండల అధ్యక్ష కార్యదర్శులు టి .సోమలింగం గౌడ్, సాయి రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, దు పల్లి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు బి .వెంకటలక్ష్మి, ఏపీఎం చిన్నయ్య, దూపల్లి పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణ, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.