
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ లో ప్రజల నీటి కష్టాలు తొలగించేందుకు కార్పొరేటర్ కొమ్ము వేణు ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి ని ఇంటింటికీ సరఫరా చేశారు. ఈ సందర్భంగా కొమ్ము వేణు మాట్లాడుతూ ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తడంతో ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందనీ, వెంటనే డివిజన్ ప్రజలకు సమస్య తీర్చడం కోసం రామగుండం మున్సిపల్ అధికారులకు టాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని విజ్ఞప్తి మేరకు మంచినీటి ట్యాంకర్లల ద్వారా ప్రజలకు మంచి నీటి అందించడం జరిగింది అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటి పరిష్కారం కోసం ముందు ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులకు మరియు సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్ రెడ్డి, మైనార్టీ జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా పాల్గొనడం జరిగింది.