– నేడు అవిశ్వాసం సమావేశం జరిగేనా…?
నవతెలంగాణ – అచ్చంపేట
భారత రాష్ట్ర సమితి పాలనా ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీట్ కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉన్న మున్సిపాలిటీలలో అవిశ్వాసం సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుంది. 14 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాస తీర్మానం కోసం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నేడు సమావేశం నిర్వహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో అచ్చంపేట మున్సిపాలిటీలో నేడు జరగనున్న అవిశ్వాస సమావేశంపై ఉత్కంఠంగా చర్చ జరుగుతుంది.

2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 20 వార్డులకు టిఆర్ఎస్ కౌన్సిలర్లు 13 మంది గెలుపొందారు. 6 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందారు. ఒక్కరు బీజేపీ కౌన్సిలర్ గా గెలుపొందారు. టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ నరసింహ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు. 5,19,2 వ వార్డుల టిఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు మరో ముగ్గురు టిఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస సమావేశానికి మద్దతు ఇస్తున్నట్లు కలెక్టర్కు ఇచ్చిన దరఖాస్తులో సంతకాలు చేసినట్లు తెలిసింది. బిజెపి పార్టీ కౌన్సిలర్ కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆఫీసియో ఓటు తో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 16 చేరుకుంటుంది. నేడు అవిశ్వాస తీర్మానం సమావేశం జరుగుతే… కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ మునిసిపల్ చైర్మన్ గా బాధితుల స్వీకరించి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తం పైన నేడు జరగనున్న మున్సిపల్ అవిశ్వాస తీర్మాణ సమావేశంపై పట్టణంలో ఉత్కంఠంగా చర్చ జరుగుతుంది.