రైలు ప్రమాద బాధితులకు వేగంగా బీమా క్లెయిమ్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ వెల్లడి
ముంబయి : ఒడిస్సా రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తమ క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ ప్రక్రియను సడలించినట్టు తెలిపింది. ఈ పెను విషాదం వల్ల ప్రభావితమైన కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం అందించడానికి కంపెనీ తమ క్లెయిమ్‌ పరిష్కారాన్ని సైతం వేగవంతం చేసినట్టు పేర్కొంది. కేవలం మూడు ప్రాథమిక పత్రాల ఆధారంగా క్లెయిమ్‌లను పరిష్కరించనున్నట్లు వెల్లడించింది. బ్యాంక్‌ ఖాతా వివరాలు, మునిసిపల్‌ అధికారుల నుండి మరణ ధ్రువీకరణ పత్రం లేకుంటే ఆసుపత్రులు, ప్రభుత్వ అధికారులు లేదా పోలీసులు జారీ చేసిన మరణించిన ప్రయాణీకుల జాబితాను సమర్పిస్తే చాలని తెలిపింది.