విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ..

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని తొర్లికొండ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు బుధవారం ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు జంగం అశోక్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ బైండ్ల రాధా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే పాట పుస్తకాలు చదువుకొని ఉత్తములు కావాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జంగం అశోక్ ఉపాధ్యాయులు స్వరూపారాణి గౌతమి లలిత ఐకెపి వివో ఏలు నాగమణి లాస్య తదితరులు పాల్గొన్నారు.