నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తాడ్ బిలోలి జిల్లా పరిషత్ పాఠశాల లో జెడ్పీటీసీ మేక విజయ సంతోష్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమంలో భాగంగా నిరుపేద విద్యార్థులు అందరిని బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ, ఉపాధ్యాయులు, ఐకెపి సిబ్బంది తదితరులు ఉన్నారు.