వడపర్తిలో ఘనంగా పాఠశాల పున ప్రారంభోత్సవం…

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాథమికోన్నత పాఠశాల వడపర్తిలో రీఓపెనింగ్ డే నిర్వహించగా,  ముఖ్యఅతిథిగా  గ్రామ మాజీ సర్పంచ్  ఎలిమినేటి క్రిష్ణారెడ్డి హాజరై, విద్యార్థులకు పెన్సిల్,పెన్నులు, నోటు బుక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. పిల్లలకు ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ గుర్రంరాజు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్  మేడబోయిన పద్మ,  ఉపాధ్యాయులు శైలజ, స్వరూప,ఉపేంద్రా దేవి, రమేష్, విద్యాభిమానులు రమేష్ , జంగయ్య, సురేష్, సత్తయ్య, రమేష్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.