నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పంతంగి మండల పరషత్ ప్రాథమిక పాఠశాలలో ఆచార్య జయ శంకర్ బడి బాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంతంగి ఎంపీటీసీ బోయ ఇందిరసంజీవ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు యూని పాంమ్స్,బుక్స్ పంపిణి చేశారు.ఎంపీటీసీ ఇందిరసంజీవ మాట్లాడుతూ.. విద్యార్థులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులకు ప్రభుత్వ పుస్తకాలను అందజేశారు.విద్య మన హక్కు అందరు ప్రభుత్వ బడులలో చేరాలని పిలుపునిచ్చారు. పిల్లలు బాగా చదువుకొన్ని తల్లీదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు సంధ్య రాణి, జానకి, గీత రాణి, స్వప్న, దీపిక అంగన్ వాడి టీచర్స్ శోభ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.