నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గాగీల్లపూర్,దాచారం,బేగంపేట, కల్లేపల్లి గ్రామాల్లోని ప్రాథమిక,ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు,అందుబాటులో ఉన్న యూనిఫామ్స్ ను పంపిణీ చేసినట్టు ఎంఈఓ పావని బుధవారం తెలిపారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పంపిణీ చేయనున్నట్టు ఎంఈఓ తెలిపారు. ఎంపీటీసీలు కొలిపాక రాజు,కొమిరే మల్లేశం,అయా పాఠశాలల బోధన సిబ్బంది,అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు,విద్యార్థులు హజరయ్యారు.