వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా ముక్కు దిబ్బడ సమస్య ఏర్పడుతుంది. మారిన వాతావరణం, చల్లటి గాలి వల్ల పట్టేస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పుప్పొడి, దుమ్ము, పెంపుడు జంతువుల చర్మం లేదా కొన్ని ఆహారాల పదార్థాలు కూడా ముక్కు దిబ్బడకు కారణమవుతాయి. అలాగే.. పొగ, రసాయనాలు, నాసికా లైనింగ్ వాపు వల్ల ముక్కు దిబ్బడ పట్టడం ఏర్పడుతుంది. ముక్కు దిబ్బడ నయం చేయడంలో సహాయపడే నివారణలు తెలుసుకుందాం.
ఆవిరి పీల్చడం : యూకలిప్టస్ లేదా పుదీనా వంటి మూలికా నూనెలతో కలిపి ఆవిరి పీల్చితే.. ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం టీ : అల్లం టీ తీసుకోవడం వల్ల ఇన్ఫమేషన్ తగ్గిస్తుంది. దీంతో నాసికా రద్దీని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి సైనస్‌లను క్లియర్ చేయడంలో సహాయపడతాయి.
పసుపు పాలు : గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలతో కూడిన సమ్మేళనం, ఇది ఎర్రబడిన నాసికా భాగాలను ఉపశమనం చేస్తుంది.
తులసి టీ : తులసి టీ రోగనిరోధక శక్తికి శ్వాసకోశ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఇది నాసికా రద్దీని తగ్గించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.