రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: సత్యం గౌడ్

నవతెలంగాణ – చండూరు 
చండూర్  మున్సిపల్ పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో గురువారం చండూర్ ఆర్డీవో సుబ్రహ్మణ్యం కు  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..  పట్టణంలో
 రోడ్డు  విస్తరణ పనులు ఆగిపోయి సుమారు పది నెలలు కావస్తున్నా.. ఏక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నరు. రోడ్ల వెడల్పు, డ్రైనేజీ పనులు మొదలుపెట్టి  అసంపూర్తిగా ఆగిపోయి ప్రయాణికులు, బాటసారులు,స్థానిక ప్రజలు  నాన్న ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  వర్షం వచ్చినప్పుడు డ్రైనేజీలోకి నీరు వెళ్లకుండా రోడ్ల మీద నే నిలిచి చెరువులను తలపిస్తున్నాయని వాపోయారు. దీని వలన ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. మార్కెట్ వద్ద వేసిన కంకర వలన వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. రాళ్లు వాహనాల కింద పడి పైకి లేచి వచ్చి గాయాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అని అన్నారు. కొన్ని  చోట్ల  డ్రైనేజీ వల్ల కొంత మంది నీటిని డ్రైనేజీలో వదలడం వలన కొన్ని ప్రాంతాల్లో నీరు పోకుండా దుర్గంధం వాసన వినపడుతుందని అన్నారు. వర్షాకాల సీజన్ కారణంగా  వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పనులను పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టర్ తన ఇష్టానుసారం పనులు చేయడం వలన రోడ్డు సమాన భాగాలు చేయకుండా. కొన్ని ప్రాంతాల్లో తన ఇష్టానుసారం చేసినట్లు ఆరోపణలు  వేపిస్తున్నాయి  అన్నారు. తక్షణ సంబంధిత అధికారులు స్పందించి రోడ్ల వెడల్పు 100 ఫీట్లు విండే విధంగా చేయాలని కోరారు. అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సోమ, రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధి కోమటి వీరేశం, మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, బోడ ఆంజనేయులు, బూతురాజు శ్రీహరి, తడకమల శ్రీధర్ , సోమ శంకర్, బొబ్బిలి శివ, దుస గణేష్, దోటి శివ, ఈరిగి ఆంజనేయులు, గండు శ్రీకాంత్, భూతరాజు స్వామి, దోటి కిరణ్ యాదవ్, కటికం నరేష్, చెరుపల్లి కృష్ణ, గండూరి మల్లేష్, సోమ రాజు, తదితరులు పాల్గొన్నారు.