ముంపు ప్రాంతాల ప్రజలు వరదల పట్ల అవగాహన పెంచుకోవాలి: ఎస్ఐ ఏ కమలాకర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఈ వర్షాకాలంలో ముంపు ప్రాంతాల ప్రజలు వరదల పట్ల అవగాహన పెంచుకోవాలని పసర ఎస్ ఐ ఏ కమలాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వీల్స్ కాలనీని ఎస్ ఐ కమలాకర్ సందర్శించి ప్రజలతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.వర్షాకాలం లో అధిక వర్షాల వల్ల వరద తాకిడి పెరుగుతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామస్తులకు సూచనలు చేయటం జరిగింది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే పోలీసు వారికి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, వరద ముంపు కు గురి కావటానికి అవకాశం ఉన్న ప్రాంతాల వారు వర్ష తీవ్రత బట్టి వరద తాకిడిని అంచనా వేస్తూ ఉధృతి పెరిగితే ఆ ప్రాంతాన్ని కాలి చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ల వలిసి ఉంటుందని చెప్పటం జరిగింది.కార్యక్రమం లో పోలీసు సిబ్బంది గ్రామస్తులు  పాల్గొనటం జరిగింది.