నవతెలంగాణ – కోహెడ
మండలంలోని శనిగరం గ్రామ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన పలకలు అందించి ఓనమాలు రాయించారు. రానున్న రోజులలో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొంపల్లి స్వప్న శశిధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరళ, అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్మన్ వనిత, లావణ్య, ప్రధానోపాధ్యాయుడు తోగిటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు శైలజ, శ్రీలత, గీతాదేవి, వెంకటేశ్వర్లు, మమత, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.