హాస్టల్‌ గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

– మెను ప్రకారం భోజన వసతి కల్పించాలి
– జిల్లా చైర్‌ పర్సన్‌ తీగల అనితా రెడ్డి
– బీసీ బాలుర గురుకుల, బాలికల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-కందుకూరు
గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నారని జిల్లా చైర్‌ పర్సన్‌ తీగల అనితా రెడ్డి అన్నారు. శుక్రవారం మండల బైరాగి గూడ నిషిత ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిరా వుపూలే గురుకుల పాఠశాలలో గూడూరు గేటు వద్ద ఉ న్న బాలికల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో వసతులు సరిగా కల్పించడం లేదని, విద్యార్థుల ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని ప్రిన్సిపల్‌ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.హాస్టల్‌ డైనింగ్‌ హాల్లో వంట గదిలో శుభ్రత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపా లన అవసరం అన్నారు మూత్రశాలలు, మరుగుదొడ్లు, శుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. తరగతి గదులను పరి శీలించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. బాలికల గురుకుల పాఠశాలలో భోజ నం చేసి, వంటలు బాగున్నాయని, ఉలాగనే ఎప్పుడు వం టలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైస్‌ ఎంపీపీ గంగుల శమంత, ఎంపీడీవో సరిత, ప్రిన్సిపాల్‌ ఈమని శ్రీలక్ష్మీ, ఇన్‌చార్జి ఎంఈఓ మనోహర్‌, కాంగ్రెస్‌ నాయకులు సరి కొండ మల్లేష్‌, పాండు, జగన్‌, ఇస్లావత్‌ శీను, మాజీ ఉప సర్పంచ్‌ గుండ్ర సుధాకర్‌ రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.