– అడ్డంకులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్ : వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, భాషా పండితుల పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. 2017, 2019లో పీఈటీలు, భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ 10479 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతీకరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయగా.. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ పోస్టుల ఉన్నతీకరణ, పదోన్నతుల ప్రక్రియను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై కొందరు ఎస్జీటీలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఎస్జీటీల దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిని నియమించి పీఈటీల పదోన్నతులకు అనుకూలంగా తీర్పు రావడానికి కషి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (పెటా టిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. కష్ణమూర్తి గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)గా పద్న్నోతులు కల్పించేందుకు ఏ విధమైన అడ్డంకులు లేనందున.. తక్షణమే వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని ఈ సందర్భంగా పెటా టిఎస్ నాయకులు కోరారు.