నేడు జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులలో ఎస్జిటీ ఉపాధ్యాయులకు తగిన న్యాయం చేయాలని కోరుతూ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గట్టుప్పల మండలంలోని తెరట్టుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రాథమిక ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ… 1.నేడు జరుగుతున్న ఉపాధ్యాయ పదోన్నతులలో గతంలో ప్రకటించినట్లు ఎస్జిటిలకు పదివేల పీఎస్ హెచ్ఎం పోస్టలు ప్రకటించి పదోన్నతులు కల్పించాలి.
2. జీవో నెంబర్ 11,12 ల ప్రకారం మాత్రమే పండిట్, పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలి.
3. ప్రతి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాలి.
4. గతంలో మాదిరిగా ఉపాధ్యాయులకు నెలనెల ప్రమోషన్లు కల్పించాలి.
5. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎస్జిటి ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి.
6. ఇప్పటివరకు ప్రమోషన్ రాకుండా 12 సంవత్సరాల స్కేల్ తీసుకున్న ప్రతి ఎస్బిటీకి స్కూల్ అసిస్టెంట్ హోదాను కల్పించాలి. విద్యకు పునాది,తొలిమెట్టు ప్రాథమిక విద్ద్యే కాబట్టి ప్రాథమిక విద్య బలోపేతం కావాలంటే ప్రాథమిక ఉపాధ్యాయుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనలో ప్రాథమిక ఉపాధ్యాయులు మేకల నరసింహ, పేర్వాల రాణి, బురుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.