డ్రగ్స్‌ మీద యుద్ధం (పాట)

War on Drugs (Song)నిర్మిద్దాం మనం డ్రగ్స్‌ లేని సమాజం
డ్రగ్స్‌ మీద చేద్దాం పోరాటమందరం
దేశభవిత దిద్ద వలసినట్టి యువతరం
డ్రగ్స్‌ మాయలో దిగబడి మానని గాయం
డ్రగ్సుకు అలవటితిమా ప్రమాద జీవితం
ఆ మత్తుల గమ్మత్తులు యువత కిక్కులు||

డ్రగ్సుకు బానిసవైతే బతుకు దుర్భరం
ప్రాణాంతక మత్తు నల్లమందు ఇంజక్షన్‌
డ్రగ్సు మీద జట్టుకట్టి చేద్దాం యుద్ధం
పబ్బు రేవు కల్చరుకు పాతర వేద్దాం ||

డ్రగ్స్‌ వాడుతుంటే నిస్తేజ శరీరం
మానసిక ఆందోళన జీవిత పతనం
మత్తు పదార్థాల దంద మట్టుపెట్టుదాం
సప్లై చేసే వారిని వేటాడి తరుముదాం ||

తెలంగాణ పోలీసులు తెగువ చూపుతున్నరు
డ్రగ్స్‌ మీద తిరగబడితే
మనకండగ ఉన్నరు
డ్రగ్స్‌ రహిత నగరంగా
తీర్చి దిద్దుదాం
హైద్రాబాద్‌ జిందాబాద్‌
జై కొడదాం అందరం||

– సాంబరాజు యాదగిరి, 9346018141