ఎంత పెద్ద పొరపాటో!
హరీష్: ఒరే గిరీష్… పక్కవీధిలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పొరపాటయిందిరా.
గిరీష్: ఏమయింది? చీటికీ మాటికీ పుట్టింటికి వెళ్తోందా?
హరీష్: పుట్టింటికి బాగానే వెళ్తుంది గానీ వెంటనే మళ్లీ తిరిగి వస్తుందిరా.
ఏమైనా తేవాలా అమ్మా?
తల్లి: ఏరా ఎక్కడ వున్నావ్?
కొడుకు: బయటకు వచ్చానమ్మా. ఎందుకు?
తల్లి: నీ కోసం ఎవరో వచ్చార్రా.
కొడుకు: ఏమైనా తేవాలా? కూల్‌డ్రింక్స్, స్వీట్స్ లాంటివేమైనా?
తల్లి: నువ్వేమీ తేనవసరం లేదు. వాళ్లమ్మాయిని ప్రపోజ్ చేశావట కదా. వాళ్లే జనాన్ని తెచ్చారు.
విటమిన్ డి
భార్య: ఉదయం టెర్రస్ మీదికి ఎందుకు వెళ్ళారు?
భర్త: విటమిన్ డి కోసం.
భార్య: రేపటి నుండి విటమిన్ డి రాదు లెండి. నిన్ననే ఆమె ఇల్లు ఖాళీ చేసింది.
బిఫోర్ – ఆఫ్టర్
భర్త: హాస్పిటల్ కి వెళ్లావుగా. డాక్టర్ ఏం చెప్పారు?
భార్య: బరువు తగ్గమన్నారండి.
భర్త: ఓ… మరి ఫుడ్ విషయంలో ఏమైనా చెప్పారా?
భార్య: రాత్రిపూట ఓట్స్ తినమన్నారు కానీ భోజనం ముందో, తర్వాతో చెప్పలేదండి.
తేడా అదే
గురువు: ఏకలవ్యుడికీ మీకూ చదువుకోవడంలో చాలా తేడా ఉంది. అదేంటో చెప్పు?
శిష్యుడు: మేం వేలకు వేలు పోసి చదువుకుంటుంటే, ఏకలవ్వుడు మాత్రం ఒక్క వేలు కోసుకుని చదివాడు.