హైదరాబాద్: ఐటీఎఫ్ జాతీయ సబ్ జూనియర్ ట్రయాథ్లాన్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయి జొహన షిజు సిల్వర్ మెడల్ సాధించింది. శనివారం గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన పోటీల్లో సబ్ జూనియర్ గర్ల్స్ విభాగంలో జొహన రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. మణిపూర్ అమ్మాయి పసిడి నెగ్గగా, మహారాష్ట్ర అమ్మాయి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, టీఏటీ అధ్యక్షుడు మదన్ మోహన్ విజేతలకు బహుమతులు అందజేశారు.