నవతెలంగాణ-ఉప్పల్
రామంతాపూర్ డివిజన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ బండారి శ్రీవాణి శనివారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. వర్షాకాలం కారణంగా డివిజన్‌లోని పలు కాలనీలు, భరత్ నగర్ రోడ్డు నెంబర్2, రోడ్డు నెంబర్ 3, శ్రీనివాసపురంలో సీసీ రోడ్లు, స్ట్రాం వాటర్ డ్రైన్, ఇంద్రానగర్ మెట్లగల్లీ రోడ్డు, శాంతినగర్ డ్రైన్, తదితర కాలనీల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జోనల్ కమిషనర్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్టు ఆమె తెలిపారు.