
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ 1986-1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మేము దౌల్తాబాద్ మండల కేంద్రంలో పదవ తరగతి పూర్తయిన తర్వాత మళ్లీ 37 సంవత్సరాల తరువాత ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మేము ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి రావడానికి మా గురువులే కారణమని తల్లి, తండ్రి తరువాత ఎవరైనా గురువులను గౌరవించాలన్నారు. త్రిమూర్తులు అంటే తల్లి, తండ్రి, గురువు అన్నారు. మేము గురుదక్షణ కింద వారికి ఏమిచ్చినా కాని వారు రుణం తీర్చుకోలేమని తెలిపారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో కత్తిపోటు తప్పిన గాని కలంపోటు తప్పదన్నారు. ఒక చిన్న అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ దేశ అత్యున్నత పదవి అయిన ప్రధాని, రాష్ట్రపతి వరకు ఎవరైనా పాఠశాలకు వెళ్లకుండా గురువుల చేత విద్య బుద్ధులు అభ్యసించకుండా సాధించలేమన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని అలాంటి గొప్ప ఉపాధ్యాయులు మాకు దొరకడం ఎంతో అదృష్టమని అన్నారు. మాకు తల్లిదండ్రులు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే మేము ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి మా గురువులే కారణమన్నారు. జీవితాంతం మా గురువులకు రుణపడి ఉంటామని వారిని ఎల్లవేళలా గుర్తించుకుంటామని తెలియజేశారు. అలాగే గురువులు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ విద్యార్థులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం అన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు తమ కంటే ఉన్నత స్థాయికి ఎదిగితే దానికి మించిన గురుదక్షిణ లేదన్నారు. విద్యార్థులదరూ గొప్ప స్థాయికి ఎదిగి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బీ. రంగారెడ్డి, ఉపాధ్యాయులు లింగమూర్తి, నరసింహ చారి,విట్టల్ , దేవేందర్ రెడ్డి, విద్యార్థులు ఏ .శ్రీనివాస్, బి మల్లేశం ,ఎం వీరేశం, కిషన్, ఎస్ జ్యోతి, జి పద్మ, రమేష్ గౌడ్ ,బి .శ్రీదేవి, ఎన్. రామయ్య, బాలచారి, బి .వీరేశం, సిహెచ్. శ్రీనివాస్, కే .మల్లేశం ,టీ. బాలయ్య ,వెంకటరామిరెడ్డి, ఎన్. అరుణ, విజయలక్ష్మి, నరసింహారెడ్డి ,కే .రాజిరెడ్డి, సిహెచ్. అంజయ్య, సిహెచ్. కమల, సిహెచ్. విమల, ఏ. మల్లేశం ,ఏ .పాపయ్య, వెంకట్ గౌడ్ ,లింగం గౌడ్, జి .శ్రీనివాస్ రెడ్డి, జె. హరిబాబు ,చంద్రమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.