సాహితి స‌మాచారం

‘కన్నవారికలలు-పిల్లల బాధ్యతలు’ కవితలపోటీ
సాహితీకిరణం సౌజన్యంతో కొసరాజు ఆర్తి Ê జాహ్నవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ‘కన్నవారి కలలు-పిల్లల బాధ్యతలు’ అనే అంశంపై కవితలను ఆహ్వానిస్త్తున్నారు. ఈ పోటీలో 7 బహుమతులు (ప్రథమ, ద్వితీయ, 5 కన్సొలేషన్‌ బహుమతులు) వుంటాయి. 20 లైన్లకు మించని కవితలు పోస్టు/ కొరియర్‌ ద్వారా జులై 31వ తేదీ లోపు ‘ఇం.నెం.11-13-154, అలకాపురి,రోడ్‌ నెం.3, హైదరాబాద్‌-500102’ చిరునామాకు పంపాలి. వివరాలకు : 9490751681. – పొత్తూరి సుబ్బారావు
స్ఫూర్తి పురస్కారాల ప్రదానం
వసుంధర విజ్ఞాన వికాసమండలి 31వ వార్షికోత్సవం ఈ నెల 26న మద్యాహ్నం 2 గంటలకు రవీంధ్రభారతిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, రాజ్‌టాగుర్‌ మక్కాన్‌ సింగ్‌, జి.వివేక్‌ పాల్గొంటారు. కాగా ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చిన డా, ఆర్‌, రమేశ్‌, దేవి, లక్ష్మినర్సయ్య, జబ్బర్‌ ఖాన్‌, గంటపద్మ, వర్షిణీ, సతీశ్‌, డి.చక్రపాణి, టి. కనకచారి, వి.బాపురావు, అక్షరకుమార్‌, సుధారాణి, శ్రీసుధ, జ్ఞానేందర్‌ గుప్తా, రవికుమార్‌ తదితరులకు స్ఫూర్తి పురస్కారాలు అందజేస్తారు. కవితల పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తారు. – మధుకర్‌ వైద్యుల, 8096677409