కురుమల అభివృద్ధికి కృషి చేయాలి

– సంఘంలోకి సభ్యులను చేర్చుకోవాలి
– అసోసియేషన్‌ అధ్యక్షులు రమేష్‌ కురుమ
నవతెలంగాణ గండిపేట్‌
కురుమల అభివృద్ధికి కృషి చేయాలని, అందరూ ఐక్యంగా ఉండి, ముందుకు రావాలని బండ్లగూడ కురు మ సంఘం అధ్యక్షులు రమేష్‌ కుర్మ, ప్రధాన కార్యదర్శి బాబురావు కురుమ అన్నారు. ఆదివారం బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కిస్మత్‌పూర్‌ సంధ్యానగర్‌ కాలనీలో కురుమ సంఘం అసోసియేషన్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. సంఘం సభ్యులందరూ కురుమల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. బండ్లగూడ పరిధిలో ఉన్న కురుమ సంఘ సభ్యులందరినీ సంఘంలో సభ్యులుగా చేర్చుకునేందుకు చొరవ చూపాలన్నారు. సంఘం తరఫున నిర్వహించే ప్రతి సమావేశానికీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలన్నారు. ప్రతి నెలా స మావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సభ్యులందరూ సహకరించాలని కోరారు. కులపరమైన సమస్యలు ఏమైనా వచ్చినా కలిసికట్టుగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించేం దుకు కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసి యేషన్‌ సభ్యులు మల్లేష్‌ కురుమ, ప్రధాన కార్యదర్శి బాబురావు కురుమ, ఆర్గనైజ్‌ సెక్రెటరీ సత్యనారాయణ కుర్మ, సభ్యులు జగదీష్‌ కురుమ, కృష్ణయ్యకురుమ, తదితరులు పాల్గొన్నారు.