గ్రామాల సమస్యలను నా దృష్టికి తీసుకురండి: మంత్రి పొన్నం

– కాంగ్రెస్ నాయకులతో మంత్రి సమావేశం 
– సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశం 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామాలలోని ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ మండల పార్టీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. గ్రామాల్లో రోడ్లు , మురుగు కాలువలు నిర్మాణం , చెరువుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలైనా అధికారులు ముందుండి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు తెలపాలని అన్నారు. ఈ నెల 21 న హుస్నాబాద్ నియోజకవర్గం లోని ఏడు మండలాలలో విడతల వారిగా  గ్రామాల్లో పర్యటిస్థానని అన్నారు. 24 వ తేదిన హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. అర్హతలను బట్టి ఉద్యోగాలు ఉంటాయని పేర్కొన్నారు. ఏ  కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటిని గుర్తించి నిరుద్యోగులకు  ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల వారిగా సమస్యల పరిష్కారానికి ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు  లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, చిత్తారి రవీందర్, తదితరులు పాల్గొన్నారు .