ఎమ్మెల్యేకు చేనేత కార్మికుల సమస్యల వినతి..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హైదరాబాదులో వారి నివాసంలో సోమవారం కలిసి చేనేత కార్మికుల సమస్యలను వివరించారు. చేనేత సహకార సంఘంలో కూరుకుపోయిన నిలువలను తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయవలసిందిగా, చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన బకాయిలను టెస్కో ద్వారా త్వరగా చెల్లించే విధంగా కృషి చేయాలని,చేనేత సహకార సంఘాలకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగినది. వారు మాట్లాడుతూ.. గత కెసిఆర్  ప్రభుత్వం చేనేత సహకార సంఘాల నిర్వీర్యం చేసి  కోలుకోలేని స్థితిలో నెట్టివేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం,కేసీఆర్ పై మండిపడినారు. తన ఆయాములోనే  చేనేత సహకార సంఘంలకు మరియు కార్మికులకు ఉమ్మడి రాష్ట్రంలో రూ.350 కోట్ల రుణమాఫీ చేసిన విషయం గుర్తు చేసినారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణలో కాబోయే మంత్రివర్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ముందస్తుగా శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపడం జరిగినది. ఉమ్మడి నల్లగొండ జిల్లా DCCB డైరెక్టర్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు పిల్లలమర్రి శ్రీనివాస్ పోచంపల్లి చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు భారత వాసుదేవ్ కొయ్యలగూడెం చేనేత సహకార సంఘం అధ్యక్షులు గడ్డం జయశంకర్ మాజీ ఆర్.టి.ఏ మెంబర్ తడక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.