పేద, ధనిక తారతమ్యం లేకుండా భక్తిశ్రద్ధలతో బక్రీద్..

– త్యాగానికి ప్రతీక బక్రీద్..
– వేములవాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు..
– బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ
పేద, ధనిక  అన్న తారతన్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండగను పురస్కరించుకుని చిన్నా, పెద్దా తేడా లేకుండా పవిత్రమైన ఆధ్యాత్మిక భావనతో ప్రార్థనల్లో పాల్గొన్నారు.బక్రీద్ పర్వదినాన్ని  సోమవారం ముస్లింలు ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి ఈద్గాలకు చేరుకొని “ఈదుల్ అజా నమాజ్” చేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా పవిత్రమైన ఆధ్యాత్మిక భావనతో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒకరినొకరు అలింగానం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటూ భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్నారు.  ఈద్గాలో మౌలానా మాట్లాడుతూ దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నామన్నారు, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక, పేద అన్న తారతన్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండగను జరుపుకున్నట్లు తెలిపారు.అలాగే ఈద్గాను ప్రతి సంవత్సరం పండగ ముందు రోజున సందర్శించి కావలసిన సదుపాయాలను ఏర్పాట్లు చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ కమిషనర్ జి.అన్వేష్, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బక్రీద్ విశిష్టతలో భాగమైన ముస్లింలు ఖుర్బానీని (మాంసాన్ని ) సగం పేదలకు, బంధువులకు పంచిపెట్టారు.ఈ వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. వేడుకల్లో మత పెద్దలు ముస్లిం నాయకులు, ప్రజా ప్రతినిధులు ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ బక్రీద్ పండగ సందర్భంగా వేములవాడ పట్టణ సీఐ, వీర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ఎలాంటి అవాంచనీయాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్..
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో బక్రీద్ వేడుకల్లో  ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ  ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో హిందూ ముస్లిం భాయి భాయి లాగా ఉండి శాంతిని నెలకొల్పే విధంగా ఉండాలని అన్నారు…దేవుని పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు..బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.