అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఈ చిత్ర టీజర్‌తో పాటు ఇటీవల విడుదలైన ‘పుష్ప..పుష్పరాజ్’, టైటిల్ సాంగ్, కపుల్ సాంగ్‌గా విడుదలైన రెండో లిరికల్ సాంగ్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ..’ మంచి రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే మొదట ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తున్నామని ప్రకటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. షూటింగ్ పార్ట్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో సినిమా విడుదల తేదిని మార్చినట్లు మేకర్స్ పేర్కొన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజరు, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, లిరిసిస్ట్: చంద్రబోస్.