24 నుంచి ఏపీ అసెంబ్లీ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు. నిజానికి 19 నుంచే సమావేశాలు జరగాల్సి ఉండగా, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బక్రీద్‌ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత, నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది.