– ఎల్లంపల్లి పేస్ 2 లో పోయిన భూములు తొలగించని అధికారులు
సాగు చేసుకుంటున్న కొందరు వ్యక్తులు
నవతెలంగాణ – చందుర్తి
వడ్డించే వాళ్ళు మనోళ్ళఉంటే ఏ మూల కు ఉన్న భోజనం పుష్టిగా తినవచ్చు అన్నట్లుగా ఉంది.ఎల్లం పల్లి ప్రాజెక్ట్ పేస్2 లో భాగంగా రైతులకు సాగు నీరు అందించడానికి 2010 సంవత్సరంలో బండపల్లి ఊర చెరువును విస్తరణ చేపట్టారు. దీంతో చెరువులో భూమి కోల్పోయిన నిర్వాసితులకు నష్ట పరిహారం ఇచ్చినప్పటికీ కొందరి భూములను లిస్ట్ నుండి తొలగించక పోవడంతో ఇంకా సాగు చేసుకోవడం తో అట్టి విషయాన్ని గ్రామస్తులు జోక్యం చేసుకోగా వెలుగులోకి వచ్చింది.
భూ సేకరణలో రెండు వందల ఎకరాలు
చెరువు విస్తరణలో భాగంగా అధికారులు భూ సేకరణ సర్వే చేయగా రెండు వందల ఎకరాల రైతుల భూములను గుర్తించారు. నిర్వాసితుల కు అప్పటి ప్రభుత్వ రేట్ ప్రకారం చెల్లించారు. కానీ రిజర్వాయర్ లో కోల్పోయిన భూమి ని రికార్డుల లో తోలగించక పోవడంతో కొందరు రైతులు భూ విక్రయాలు జరిపుతున్నట్లుగాసమాచారం.అదేవిదంగా మరి కొందరు రైతులు బోర్ బావి కూడా తవ్వి వ్యవసాయ సాగు చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మరో వైవుగా విద్యుత్ శాఖ వారు భూములు కోల్పోయిన వ్యవసాయ బావుల మోటర్లకు కరెంట్ సరఫరా చెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రికార్డుల లో తొలగించక అధికారుల నిర్లక్ష్యం
భూసేకరణ చేసిన సమయంలో అంత మ్యాన్ వల్ పహాని ఉండడంతో భారీగా భూ సేకరణలో అక్రమాలు జారిగినట్లుగా తెలుస్తుంది. 511/ఆ సర్వే నంబర్లో మామిడి రాములు అనే రైతు కు చెందిన మూడు ఏకరాలు రిజర్వాయర్ లో కోల్పోగా అట్టి భూమిని రికార్డ్ ల తొలగించకుండా గతం లో ఇక్కడ పని చేసిన ఓ సర్వేయర్ 20 గుంటలకు రైతుకు ధర చెల్లించి 1.23 గుంటల భూమి ని పట్టా చేయించినట్లుగా గ్రామస్తుల ద్వారా తెలిసుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నట్లైతే అక్రమాలు బయట పడే అవకాశం ఉందని తెలుస్తుంది.
అధికారుల నిర్లక్ష్యంతో అక్రమాలు
ఎంపీటీసీ రణదీర్ రెడ్డి అధికారుల నిర్లక్ష్యంతో నే బండపల్లి రిజర్వాయర్ లో భారీగా అక్రమాలు జరిగాయి.ఒక్క ఎకరం ఉన్నవాళ్లు రెండు ఎకరాల,రెండు ఎకరాల ఉన్న వాళ్ళు మూడు ఎకరాల డబ్బులు తీసుకున్నారు.దీని పై అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరుతున్న.
తహశీల్దార్ శ్రీనివాస్, చందుర్తి
ఆ సమయం లో నేను లేను తమకు ఎలాంటి సంబంధం లేదు. తమ దృష్టి కి రాలేదు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు అక్రమిస్తే ఉపేక్షించేది లేదు.