– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 607 దరఖాస్తులు అందాయని రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు. రెవెన్యూపై 176, హౌసింగ్‌పై 58, పౌరసరఫరాల శాఖపై 54, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివద్ధి శాఖపై 36, హోం శాఖపై 62, ఇతర శాఖలకు సంబంధించి 221 దరఖాస్తులు అందినట్టు వివరించారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.