– అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్
నవతెలంగాణ – వనపర్తి
ప్రజలపై అధిక భారం వేసిన వనపర్తి మున్సిపాలిటీ, చెత్త పన్ను సేకరణ తక్షణమే ఎత్తివేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోని చెత్త సేకరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు వనపర్తి జిల్లా కేంద్రంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకష్ణ మాట్లాడుతూ చట్టంలో లేని వ్యవస్థను ప్రజలపై రుద్దడం నేరమని, ప్రజలు తమ ఇంటి టాక్స్ లో కట్టే పనుల్లోనే అన్నీ కలిపి ఉంటాయన్నారు. వనపర్తి మున్సిపాలిటీలో కొత్తగా చెత్త పన్ను వేయడం దారుణమన్నారు. గత సంవత్సరముగా ప్రజల మీద పెట్టిన ఈ భారాన్ని తొలగించాలని గద్వాల కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని వనపర్తి లో కూడా చేసి అవస రమైతే మున్సిపాలిటీ ద్వారానే ఈ భారాన్ని భరిం చాలని నాయకులు తెలిపారు. గద్వాల పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్ చెత్త పన్ను ఆపివేసి ప్రజలకు క్షమాపణ కోరాడన్నారు. చెత్త పన్ను సేకరణ చేయము అని ప్రకటన చేశారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు క్షమాపణలు చెప్పకున్నా సరేగాని ఈ భారాన్ని తొలగించాలని ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, నాయకులు బొడ్డుపల్లి సతీష్, ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు.