ఆటపాటలతో విద్యాభ్యాసం

– ఉత్తమ సంకల్పంతో ముందుకు సాగుతున్న ‘అలోకా పాఠశాల’
ఆట పాటలు.. ఉత్తమ సంకల్పాలు.. నాణ్యమైన బోధన.. మంచి ఆట స్థలాలు.. వయస్సుకు తగ్గ సిలబస్‌తో మంచి విద్యను అందిస్తున్న పాఠశాల అలోకా పాఠశాల. వికారాబాద్‌ పట్టణంలోని సాకేత్‌ నగర్‌లో ఉన్న అలోకపాఠశాల మంచి గుర్తింపు పొందింది. గత మూడేండ్ల క్రితం సాకేత్‌నగర్‌లో ఏర్పాటుచేసిన ఈ పాఠశాల చిన్నపిల్లలకు మంచి విద్యను అందిస్తుంది. అంచలంచలుగా ఎదుగుతూ నేడు 9వ తరగతి వరకు ఈ పాఠశాల నడుపుతున్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి అనుగుణంగా విద్యను అందిస్తున్నారు.
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
ఆటపాటలు, క్రీడలు, నృత్యాలు, పెయింటిం గ్‌, కంప్యూటర్‌ వంటి నైపుణ్యతను పిల్లల్లో గుర్తించి వారి కనుగుణంగానే విద్యను బోధిస్తున్నారు. ఆట, పాటలతో విద్యను అందిస్తున్నారు. సీబీఎస్‌ఈ సి లబస్‌ను, ఐఐటీ, ఎన్‌ఈటీ ఫౌండేషన్‌ అందిస్తు న్నారు. క్లాస్‌ రూమ్‌లో 24 మందిని ఉంచి వి ద్యను అందిస్తున్నారు. వ్యవస్థలో సమూల మా ర్పులు తీసుకువచ్చి పేద, మధ్య తరగతి విద్యా ర్థులు మెరుగైన విద్యనందించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్‌ గీతా జోషి తెలిపారు. వి ద్యార్థులకు ప్రాక్టికల్‌ చేసి చూపిస్తారు. పూర్తిగా పాఠశాల సీసీటీవీ పర్యవేక్షణలో కొనసా గుతుందని ఆమె తెలిపారు. విద్యార్థులకు ప్రతి శనివారం ఆటలు, పాటలు మాత్రమే కొనసాగిస్తా మని ఆమె వివరించారు. ప్రత్యేకంగా విద్యార్థులకు పెయింటింగ్‌లో క్లాస్‌ ఇస్తారు. తమ పాఠశాలలో ఉపాధ్యాయురాలైన మతానికి సంబంధించిన భాష మాట్లాడదని విద్యకు సంబంధించిన భాషను మాత్రమే పాఠశాలలో కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు. విద్యాబోధనలో తమ పాఠశాల ముందంజలో ఉందని, అలాగే ఆటపాటల్లో కూడా విద్యార్థుల ఉన్న నైపుణ్యతను కూడా తీసి వారికి అనుకుగుణంగా విద్యను అందించడంలో తాము ముందంజలో ఉన్నామని ఆమె తెలిపారు. తమ పాఠశాలో అడ్మిషన్లు మొదలు అయ్యాయని తెలిపారు. ఆసక్తి గల వారు తమను సంప్రదించి, పాఠశాలో జాయిన్‌ కావాలని కోరారు.