సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య

– అనుభవజ్ఞులతో తరగతుల నిర్వాహణ
– ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
– డిజిటల్‌ క్లాసులు బోధన
– ప్రయివేటు స్కూల్‌ అధిక ఫీజులపై చర్యలు తీసుకుంటాం
– విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్‌ మీటింగ్‌కు హాజరుకావాలి
– ఫీజుల పెంపు, నాణ్యమై బోధన విషయంలో చర్చించాలి
– సాధ్యమైనంత వరకు పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లో చేర్పించాలి
– ప్రయివేటు స్కూల్‌ నిర్వాహణపై ఆడిట్‌ చేస్తున్నాం
– విద్యాహక్కు చట్టాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవు
నవతెలంగాణతో రంగారెడ్డి విద్యాశాఖ అధికారి సుశిందర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ
సర్కారు బడుల్లో కార్పొరేట్‌కు దీటుగా క్వాలిఫైడ్‌ అధ్యాపకులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనలు అందిస్తున్నాం. ఆమ్మ ఆదర్శ కమిటీలో భాగంగా మౌలిక వసతులు కల్పించి ప్రయివేటు పాఠశాలకు తీసిపోయే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. విశాలమైన అహ్లాదకరమైన వాతావరణంలో తరగుతులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కావొద్దని ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్స్‌, నోటు బుక్స్‌, టెక్స్‌ బుక్స్‌ అందిస్తోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న బోజనం అందిస్తోంది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తోంది.తల్లిదండ్రులు తమ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు రావాలి.. వారికి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత మాది’ అని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశిందర్‌ అన్నారు. ఎడ్యూకేషన్‌ స్పెషల్‌ సందర్భంగా ఆయన నవతెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇతర విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,309 ఉండగా, కేజీబీవీలు 20, ఆదర్శ పాఠశాలలు 9 ఉండగా మొత్తం 1,338 పాఠశాలలు ఉన్నాయి. సమారు లక్ష 47 వేల 642 మంది విద్యార్థులు ఉన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా మొదటి విడతలో 423 పాఠశాలలో (తాగునీరు, విద్యుతీకరణ, మరుగుదొడ్ల) నిర్మాణాలు చేపడుతున్నారు.
పాఠశాలల ప్రారంభం దశలో పాఠ్యపుస్తకాలు అందజేత
ఈ ఏడాది పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్‌ అందజేడం జరిగింది. జిల్లాలో 9లక్షల 9 వేల 653 పాఠ్యపుస్తకాలు 6లక్షల 45 వేల 804 మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది. 4లక్షల 86 వేల 768 నోట్‌ బుక్స్‌ 2 లక్ష 70 వేల 651 మంది విద్యార్థులకు అందించాం.
విద్యార్థులందరికి నాణ్యమైన యూనిఫామ్స్‌..
స్కూల్‌ ప్రారంభానికి ముందే జిల్లాకు యూనిఫామ్స్‌ వచ్చాయి. ఈ ఏడాది పాఠశాలలు ఓపెనింగ్‌తో విద్యార్థుల కు యూనిఫామ్స్‌ ఇవ్వడం జరిగింది. జిల్లాకు లక్ష 47 వేల 642 యూనిఫామ్స్‌ వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు లక్ష 42 వేయి 190 మంది విద్యార్థులకు పంపిణీ చేశాం.
బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంపు
బడిబాట కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో వీధివీధినా తిరిగి బడిడు పిల్లలను బడిలో చేర్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత ఎంటో విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి ప్రయివేటు స్కూల్‌ వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ప్రయత్నం చేయడం జరిగింది. గతేడాదితో పోలిచితే ఈ ఏడాది చేరికల సంఖ్యల పెరగనుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూల్లపై విశ్వాసం పెరిగింది.
ఫీజుల విషయంలో ప్రయివేటు స్కూల్స్‌పై తనీఖీలు చేస్తున్నాం
మూడేండ్లకు సంబంధించి ఫీజుల వసూళ్లు, స్కూల్స్‌ నిర్వాహణ ఖర్చులపై ఆడిట్‌ చేసేందుకు జిల్లాలో అన్ని ప్రయివేటు స్కూల్స్‌కు నోటుసు పంపించడం జరిగింది. ప్రతి స్కూల్స్‌ ఆడిట్‌ చేసి.. ఫీజుల విషయంలో ఇతర విషాయాల్లో ఎమైన తేడాలు వస్తే ఆ స్కూల్స్‌ సీజ్‌ చేస్తాం.
ప్రయివేటు స్కూల్స్‌పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి
ప్రయివేటు స్కూల్స్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఫీజులు పెంపుపై, విద్యార్థుల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రయివేటు స్కూల్‌ యాజమన్యంతో మాట్లాడి తెలుసుకునే హక్కు ఉం ది. తమ హక్కులను వినియోగించుకుని ప్రయివేటు స్కూల్స్‌ విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఫిర్యాదులు చేయాలి. ఫీజుల విషయంలో ప్రతియేట ఎంత పెంచుతు న్నారు. ఎంత పెంచాలి అనే విషయాలపై ప్రయివేటు యాజమాన్యాలను నిలదీయాలి.
పిల్లలను ప్రభుత్వ స్కూల్స్‌కు పంపించాలి
ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ టీచర్లతో.. నాణ్యమైన విద్యాబోధనలు అందిస్తాం. విశాలమైన తరగతి గదిలో చదువుకునే అవకాశం ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది. కార్పొరేటుకు దీటుగా డిజిటల్‌ తరగతులు, మానసిక ఉల్లసం కోసం క్రీడలు, సాంస్కృతిక క్రీడలతో విద్యార్థుల మొదడుకు పదును పెట్టే ఉత్తమైన ఉపాధ్యాయులతో విద్యాబోధన ఉంటుంది.