ఉన్నత శ్రేణి విద్యా ప్రమాణాలతో, క్రమశిక్షణ కలిగిన విద్యాభోదనతో చందానగర్‌లోని విద్యమంధీర్‌హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలో 31 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించి వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల జాబితాలో చోటు సంపాదించారు. నిపుణులైన అధ్యాపక బృందం, అంకితభావం కలిగిన సిబ్బందితో క్రమశిక్షణతో విద్యా భోధన చేస్తూ సమాజంలో విద్యార్థులు తలెత్తుకుని జీవించేలా తయారు చేస్తున్నారు.
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
సాంప్రదాయాలు నేర్పిస్తూ…
ఆధునిక కాలంలో పాశ్చాత ధోరణి లో పడి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు మర్చుతున్నా రు నేటి తరం యువత. ఆలా మర్చిపోకుండా చి న్నప్పటి నుండే విలువలతో కూడిన విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పిస్తూనే చదువుల్లో నూ రాణించేలా భాద్యత తీసుకుంటున్నారు. స్కూల్ కరస్పాండెంట్ శ్రీని వాస్‌రావు ఆధ్వర్యంలో స్కూల్‌ను వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా మార్గంలో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య నందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుంటూ మారుతు న్న విద్యావిధానాలకు అనుగుణంగా విద్యాభోధన చేస్తూ, కార్పొరేట్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా విద్యనందిస్తున్నారు.
స్ఫూర్తిని నింపుతూ…
విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడం కోసం అత్యధిక మార్కులు సాధించిన విద్యా ర్థులకు రూ.4వేల నుంచి రూ.10 వేల వరకు ప్రైజ్‌మని అందజేస్తూ వారిలో స్ఫూర్తిని, మనో ధైర్యాన్ని నింపుతున్నారు.
అందరి కృషితోనే ఉత్తీర్ణత సాధ్యమైంది : శ్రీనివాస్ రావు
పదో తరగతి ఫలితాలలో మన పాఠశాలలో 31మంది విద్యార్థులు పాల్గొ నగా అందరూ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నట్టు స్కూల్ కరస్పాండ్ కంచెర్ల శ్రీనివాస్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల సంఖ్య 3927. ఇందులో మన పాఠశాల కూడా ఒకటైన సందర్భంగా గర్వ పడుతున్నా మన్నారు. మన పాఠశాల విద్యార్థిని కొగంటి మోహనశాంతి అత్యధిక జీపీఏ 9.7 సాధించినందులకు ప్రత్యేక అభినందనలు. ఈ సాధనలో అంకిత భావనతో పనిచేసిన ఉపాధ్యాయులకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాధనకై మాకు సహాయ, సహకారాలు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే దృఢ సంకల్పంతో, అంకిత భావంతో కృషి చేస్తామన్న ఆత్మ విశ్వాసంతో మన పాఠశాల విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడు అందిస్తాం.