ఆదర్శంగా అమ్మ ఆదర్శ పాఠశాలలు

– ప్రభుత్వ స్కూళ్ల ఆధుణీకీకరణ బలోపేతమే లక్ష్యంగా
– సౌకర్యాలు, సదుపాయాలు కల్పన
– గతంలో మన ఊరు-మన బడి పేరిట పనులు
– తాజాగా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో అన్ని హంగులు
ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మన బడి పేరిట పలు స్కూళ్లను ఎంచుకొని కార్పోరేట్‌ హంగులతో తీర్చిదిద్దారు. కాగా తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లల్లో సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు పెద్దపీట వేసింది. దీంట్లో భాగంగా మేజర్‌, మైనర్‌ మరమ్మతులతో పాటు తాగునీటి సదుపాయం కల్పించడం, మరుగుదొడ్లు నిర్మించి నీటి వసతి కల్పించడంతో పాటు విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. వేసవి సెలవుల్లో పనులు చేపట్టారు. స్కూళ్లు పున:ప్రారంభించేలోగా పనులు చేపట్టాలని లక్ష్యంగా పనులు చేపట్టడంతో మొత్తంగా కొనసాగుతున్నాయి.
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
ప్రభుత్వ పాఠశాల అంటేనే సౌకర్యాలు ఉండవనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఈ పద్ధతి మార్చేందుకు ప్రభుత్వాలు వివిధ రకాల పేర్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. గత ప్రభుత్వం మన ఊరు మనబడి పేరిట ప్రభుత్వ పాఠశాలలో 12 రకాల సౌకర్యాలు కల్పించా లని నిర్ణయించింది. ఇందుకు మండలంలో తొలి విడత 25శాతం పాఠశాలలను ఎంపిక చేశారు. నాలుగేళ్లలో అన్ని బడులలోను సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. తొలి విడత ఎంపికైన బడుల్లో కొన్ని చోట్ల పనులు పూర్తికాగా.. పలుచోట్ల వివిధ కారణాలతో నిలిచిపోయాయి. కాగా తాజాగా ప్రభుత్వం మారడంతో రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరడంతో సర్కార్‌ బడులపై దృష్టిసారించింది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట బడులను ఆధునికరించి వివిధ రకాల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.
ప్రతిస్కూల్‌కు రూ.2 లక్షల నిధులు వెచ్చించనుంది. దీంట్లో భాగంగా ముందస్తుగా 25 శాతం ముందస్తుగా విడుదల చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం ఆయ పాఠశాలలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కూడిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ సంఘాల్లో ఒకరిని కమిటీ చైర్మెన్‌గా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి పేరిట జాయింట్‌ అకౌంట్‌ తెరిచి నిధులు జామ చేయనున్నారు. తాజాగా చేపట్టనున్న పనులను ఈ కమిటీల ద్వారానే నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం తాగునీరు, మేజర్‌ మైనర్‌ రిపేర్లు, టాయిలెట్స్‌, విద్యుద్దీకరణ పనలతో పాటు ప్రత్యేకంగా టాయిలెట్స్‌ ఇలా వివిధ రకాల సౌకర్యాలు అందు బాటులోకి తీసుకువచ్చారు. గతంలో చేపట్టిన పనులను సంబంధించి బిల్లులు సకాలంలో రాక తీవ్ర జాప్యం, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం మూలంగా పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఇలాంటి సమస్యను గుర్తించి ఎప్పటికప్పుడు బిల్లులు సకాలంలో అందజేయడం ఆయా శాఖల అధికారులతో పాటు ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టేలా ఆదేశించింది. పనులు అలా సాగితేనే ప్రభుత్వం విధించిన గడువు జూన్‌ 10 తేదీలోపు పనులు పూర్తి అవుతాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
రంగారెడ్డి జిల్లాలో 426 పాఠశాలలు, వికారాబాద్‌ జిల్లాలో 930 పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులు చేపట్టారు. ఈ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం గా పనులు చేపట్టారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, వంట శాలలు, పాఠశాల గదుల నిర్మాణం, శిథిలావస్థకు చేరిన పాఠశాలల పునరుద్ధరణ, తదితర పనులు చేప ట్టారు. ఈ పనులను త్వరగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎప్పటి కప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మండల విద్యాధికారులు పాఠ శాలలను పర్యటిం చి పనులను పర్యవేక్షిస్తున్నారు. పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు.