– శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, పరిగి బ్రాంచ్ ద్వారా బాధితురాలికి బీమా చెక్కు అందజేత
– శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, హైదరాబాద్ జోన్ డీజీఎం నరేందర్
నవతెలంగాణ-దోమ
ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ చేసుకుంటే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండాగా నిలుస్తుందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, హైదరాబాద్ జోన్ డీజీఎం నరేందర్ అన్నారు. మంగళవారం దోమ మండల కేంద్రానికి అనుసంధానమైన ఉదాన్ రావు పల్లి గ్రామానికి చెందిన జంగం పాపయ్య ఇటీవల గుండెపోటుతో మతి చెందడం జరిగింది. ఇతనికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పరిగి బ్రాంచ్లో ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నందున నామిని అయిన భార్య శ్రీజంగం భాగ్యమ్మకు రూ.3,00,000ల బీమా చెక్కును డీజీఎం నరేందర్ అందజెశారు. ఈ పాలసీని ప్రీమియం 30,000 రూపాయలతో తీసుకోవడం జరిగిందన్నారు. పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాలలోపు ఈ మరణం జరిగిందనీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ యం.సురేష్, డివో మొగులమ్మ, లక్ష్మి, ఏజెంట్ బాలమణి, భాగ్యలక్ష్మి, బీడీఎం ఆంజనేయులు, బ్రాంచ్ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.