– మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్
నవతెలంగాణ-కీసర
దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మంగళవారం దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అభివృద్ధి పనులు చేసేందుకు ఎమ్మెల్సీ వాణి నిధుల నుంచి రూ. 50 లక్షలు, మంత్రి శ్రీధర్ బాబు ఫండ్ నుంచి రూ.45 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. మున్సిపల్ నిధులు రూ.1 కోటి 34 లక్షల 15 వేలతో ఓపెన్ జిమ్, టాయిలెట్స్, మున్సిపల్ సాధారణ నిధులతో వివిధ కాలనీల్లో ఓపెన్ నాలాలు శుభ్రం చేసేందుకు, హెచ్‌ఏ సీఏ సంస్థ నుంచి మెషిన్, గడ్డి మందు దోమల మందు పారిశుధ్య సామాగ్రి కొనుగోలు మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో భూగర్భ మురుగు కాలువ రిపేర్లు, మంచి నీటి సరఫరా పైప్ లైన్ రిపేరు, మోటార్ల రిపేరు, జెట్టింగ్ మిషన్ రిపేరు, ఎలక్ట్రికల్ రెగ్యులర్ మెయింటనెన్స్, శ్మశాన వాటిక అభివద్ధి పనులు చేసేందుకు పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మెన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, డీఈఈ చిరంజీవులు, టీపీవో శ్రీధర్ ప్రసాద్, మేనేజర్ వెంకటేశం, కౌన్సిలర్లు నాను నాయక్, నాగయిపల్లి సుజాత, కొత్త హేమలత, మంగల్‌పురి వెంకటేష్, కొత్తసురేఖ, వరగంటి వెంకటేష్, మాదిరెడ్డి పావనీరెడ్డి, సంపన్ బోల్ స్వప్న, గోగుల సరిత, ముప్ప శ్రీలత, గురువెళ్లి వెంకటరమణ, పాండాల అనురాధ, వసుపతి రమేష్ గౌడ్, మాదిరెడ్డి నరసింహరెడ్డి, రామారం శ్రీహరి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు, వడియాల రజినీ, వహిదా బేగం, కందాడి చెన్నారెడ్డిలు ఉన్నారు.