యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

– యోెగా ట్రైనర్‌ సిమ్రాన్‌ అహుజా కంట్రీ క్లబ్‌ ఆధ్వర్యంలో యోగా మహౌత్సవ్‌
రోజీవ్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా కంట్రీ క్లబ్‌ ఆధ్వర్యంలో యోగా మహౌత్సవ్‌ అద్భుతమని ఇంటర్నేషనల్‌ యోగ ట్రైనర్‌ మాజీ మిస్‌ ఇండియా, సిమ్రాన్‌ అహుజా అన్నారు. మంగళవారం బేగంపేటలో కంట్రి క్లబ్‌ అధినేత సీఎండీ వై.రాజీవ్‌ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోని కంట్రీ క్లబ్‌ వీఐపీ ప్లాటినం గ్లోబల్‌ మెంబర్‌ షిప్‌ కార్డును సిమ్రాన్‌ అహుజా ఆవిష్కరించారు కంట్రీ క్లబ్‌ హైదరాబాద్‌ వేదికగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిమ్రాన్‌ అహుజా కొన్ని యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్రత్యక్ష సెషన్‌ను నిర్వహించారు. ముఖ్యంగా హఠ యోగా, ప్రాణాయామాలు, యోగా నిద్ర, సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలతో ఔత్సాహికులకు శిక్షణ అందించింది. ఈ సందర్భంగా రాజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ తత్వశాస్త్రం మూలాలను గౌరవిస్తూ ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చే కంట్రీక్లబ్‌ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంట్రీ క్లబ్‌ ప్లాటినం గ్లోబల్‌ మెంబర్‌ షిప్‌ కార్డ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.. ప్రపంచవ్యాప్తంగా 180 కంటే ఎక్కువ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రజలు యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలనే ప్రధాని మోడీ దార్శనికతకు అనుగుణంగా భారతదేశంలోని కంట్రీ క్లబ్‌లలో వివిధ ఈవెంట్‌లు, సెషన్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇక దిగ్గజ క్రీడా ప్రముఖులైన కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, మేరీ కోమ్‌, సానియా మీర్జా,పి వి సింధు,నిఖత్‌ జరీన్‌లతో అనుబంధం కలిగి ఉండడం గర్వంగా బావిస్తున్నామన్నారు. మాజీ మిస్‌ ఇండియా, ప్రముఖ అంతర్జాతీయ యోగా ట్రైనర్‌ సిమ్రాన్‌ తన అభిప్రాయాలను పంచుకుంటూ ప్రస్తుతం ప్రపంచదేశాలు సైతం భారత్‌ వైపు చూస్తున్నాయంటే ఇందులో యోగా కూడా ఒక కారణమేనన్నారు. యూఎస్‌ వంటి అగ్రదేశాల్లో యోగా భాగమైందని, అధునాతన ఫిట్నెస్‌ వ్యాయామాలకు బదులుగా వివిధ దేశాల్లో యోగాను అనుసరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక్కో ఆసనం ఒక్కో ఆరోగ్య సంరక్షణకు కేంద్రాలుగా నిలుస్తున్నాయని ఆమె తెలిపారు.