– రెండు షాపులు ధ్వంసం
నవతెలంగాణ-అంబర్‌పేట
ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు షాపులు ద్వంస మైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పి. లక్ష్మీకాంత్ రెడ్డి, ఆడ్మిన్ ఎస్సై డి. సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ ప్రాంతానికి చెందిన రమణయ్య కుమారు డు జానయ్య మంగళవారం ఉదయం 3.30 గంటలకు వివిధ స్కూళ్లకు విద్యా ర్థులను చేరవేయడానికి తిలక్‌నగర్ నుంచి కోరంటి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గ మధ్యలో తిలక్‌నగర్ మహేశ్ పాన్ షాప్ పక్కన ఉన్న వెల్డింగ్, టీ షాపులోకి వేగంగా స్కూల్ వ్యాను దూసుకెళ్లింది. దాంతో రెండు షాపులు పూర్తిగా ద్వంసమై, ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో స్కూల్ వ్యాన్‌లో విద్యార్థులు ఎవరూ లేకపోవడం, రెండు షాపులలో కూడా ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. బాధితుల పిర్యాదు మేరకు జానయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆడ్మిన్ ఎస్సై తెలిపారు.