– ప్రభుత్వమే నిర్వహించాలి :సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఈ నెలాఖరులోగా తెలంగాణలోని గనులను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గనులను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. తెలంగాణలోని ఐదు ఇనుప, ఐదు సున్నపురాయి, ఒక మాంగనీస్ మైన్లను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే కేంద్రమే వేస్తుందని ప్రకటించడం దారుణమని పేర్కొన్నారు. సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణకు చెందిన కిషన్రెడ్డి కార్పొరేట్ సంస్థల లాభాల కోసం రాష్ట్రంలో గనులను ప్రయివేటీకరిం చడానికి ప్రయత్నించడం శోచనీయమని పేర్కొన్నారు. సింగరేణిలోని 15 బొగ్గు బావులను వేలం వేయరాదనీ, వాటిని సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కోయగూడెం, సత్తుపల్లి, ఓసీపీ3 లలో అరబిందో ఫార్మాకు కేటాయించి రూ.50 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లను బీజేపీ తీసుకు న్నదని విమర్శించారు. సింగరేణి బొగ్గుబావులు ప్రయివేటు కంపెనీల చేతు ల్లోకి వెళ్లకుండా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.