నవతెలంగాణ-సిటీబ్యూరో
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బర్త్‌రైట్ బై రెయిన్బో ఆస్పత్రి, ప్రతిష్టాత్మకమైన జాయింట్ కమిషన్ ఇంటర్నేష నల్ (జేసీఐ), నుంచి గౌరవనీయమైన ‘గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్’ను మారతహళ్లి, బెంగళూరు లోని తమ హాస్పిటల్స్ కోసం అందుకున్నట్టు వెల్లడిం చింది. ”రెయిన్బో చిల్డ్రన్స్ ఆస్పత్రి వద్ద ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడం అసాధా రణమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో మా నిరంతర అంకితభావానికి నిదర్శనం. ఇది మా బందం ఐక్యత, సమ్మిళిత బలం, నిబద్ధత, మా ఆరోగ్య సంరక్షణ నిపుణులు అందించే సున్నితమైన సం రక్షణను ప్రదర్శిస్తుంది. భద్రత, నాణ్యత గొప్ప ప్రమాణాలు అనుసరణ పట్ల పూర్తి నిబద్దత ప్రదర్శించటంతో పాటు మా రోగుల్లో ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ అందుతుందని హామీ ఇస్తున్నాం” అని డాక్టర్ రమేష్ కంచర్ల, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు.