– రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయ నాయకులు కొండ రాజు నరసింహ చారి
నవతెలంగాణ-ముషీరాబాద్
బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాన్ని మార్చాలని, స్వర్ణకార వృత్తిదారులకు బంగారం వ్యాపారస్తులకు పోలీసు వారితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగా ణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయ నాయకులు కొండ్రోజు నరసింహచారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద స్వర్ణకారులు బంగారం వ్యాపారస్తుల మహాధర్నా నిర్వహిం చారు. ఈ ధర్నాలో కొండరాజు నరసింహచారి, జాతీయ ఉపాధ్యక్షులు కనెగంటి సత్యనారాయణ, బీసీ సంఘాల జేఏసీ చైర్మెన్ కుందారం గణేష్ చారి, హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో బ్రిటిష్ ప్రభుత్వం స్వర్ణకారులపై ఏర్పాటు చేసిన చట్టాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్ది బంగారం వ్యాపారస్తులకు రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకార వత్తిదారులకు బంగారం వ్యాపా రస్తులకు అక్రమ దొంగ బంగారం కేసుల పేరుతో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం వలన పోలీసు వాళ్ళతో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో దొంగలు ఎక్కడైనా దొంగతనం చేసి దొరికిన యెడల ఆ యొక్క దొంగ ఆస్తులు జప్తి చేసి బాధితులకు రికవరీ ఇప్పిం చాలని దొంగ వద్ద ఎలాంటి ఆస్తులు లేనియెడల జీవిత కాలం జైల్లో ఉంచి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దొంగలు తమ జల్సాల కోసం దొంగతనాలు చేసి పోలీసు వారికి దొరికినప్పుడు స్వర్ణకారుల షాపులను చూపెట్టడం వలన స్వర్ణకారులు బంగారం వ్యాపారస్తులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మహారాష్ట్రలో చేసిన విధంగా మన రాష్ట్రంలో కూడా చట్టం చేస్తే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. సదరు దొంగతనం చేసిన వ్యక్తి ముత్తూట్ ఫైనాన్స్, శ్రీ రామ్ ఫైనాన్స్‌లో పెట్టి విడిపించుకోవడంలేదన్నారు. ఏమీ చేయని స్వర్ణకారులపై పోలీసులు ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బ్రిటిష్ చట్టాన్ని సరిదిద్ది రాష్ట్ర స్వర్ణకారులను రక్షించాలని కోరారు. విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలన్నారు. దేవ శిల్పి విశ్వ కర్మ భగవానుడు జయంతి మహౌత్సవాలు అధికారికంగా నిర్వహించి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్య, శ్రీను శ్యాంప్రసాద్, కాలే జగన్నాథం, పట్నాల సావిత్రి సిద్ధాంతం శ్యామల తదితర నాయకులు పాల్గొన్నారు.