– ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ఊర్మిళ చౌహన్
నవతెలంగాణ-బంజారాహిల్స్
దక్షిణాదిలో మొట్టమొదటి అధునాతన చర్మ సంరక్షణ సాంకేతికత నిపుణత కలిగిన వైద్యురాలు అలెక్యా సింగపూర్ నిర్వహణలోని ‘ది స్కిన్ సెన్స్’ బంజారాహిల్స్ వేదికగా వినూత్నమైన సాంకేతికతతో రూపొందించిన ‘వేవ్‌మెడ్ పిక్సీ’ని ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్సల్‌టెంట్ డెర్మటాలజిస్టు అలేఖ్య మాట్లాడుతూ దక్షిణాదిలోని స్కిన్‌కేర్ రంగంలో ఇలాంటి వినూత్న ప్లాస్మా టెక్నాలజీని ఆవిష్కరించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. అతిథి ఊర్మిళ చౌహాన్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనానికి చర్మ సంరక్షణ చాలా అవసరమని అన్నారు. సౌందర్య సంరక్షణలో వేడ్మెడ్ పిక్సి(Wavemed Pixi), వంటి అధునాతన చికిత్సలు ప్రాముఖ్యతను సంతరించు కున్నయాన్నారు. వేవ్‌మెడ్ పిక్సీ అనేది నాన్-ఇన్వాసివ్ సర్జరీ భవిష్యత్‌కు నాంది పలుకుతుందని తెలిపారు. నాన్-సర్జికల్ బ్లీఫరోప్లాస్టీ వంటి అధునాతన పద్ధతులను ఇది ప్రతిబింభిస్తుందని చెప్పారు. చర్మ సంరక్షణ కోసం దక్షణ భారత్‌లోనే ఇలాంటి అత్యాధునిక సేవలు మొట్టమొదటగా తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంద న్నారు. నగరంలోని తమ క్లినిక్ వేదికగా ఎల్లప్పుడూ సురక్షి తమైన, అత్యాధునిక పద్దతుల్లో సేవలు అందించడ మవుతుందన్నారు. ఈ టెక్నాలజీ సహకారంతో నాన్-సర్జికల్ బ్లీఫరోప్లాస్టీతో ఎలాంటి సర్జరీ లేకుండానే కనురెప్పలు సంరక్షణ, పునరుజ్జీవనానికి గానూ నాన్-ఇన్వాసివ్ సేవలందిస్తుందన్నారు. ఈ పరికరాన్ని అతి సులభంగా వినిమోగించేలా ప్రత్యేక సాంకేతికతతో రూపొందించారని ఆమె పేర్కొన్నారు.