– కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జీ.రామేశ్వర్ రావు
నవతెలంగాణ – సిటీబ్యూరో
గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియాలో నాలుగు అద్వితీయమైన కోర్సులను ప్రవేశపెట్టినట్లు కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జీ. రామేశ్వర్ రావు తెలిపారు. ఆర్బిట్రేషన్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ కోసం ఒక సంవత్సరం వ్యవధి గల రెండు వేర్వేరు కోర్సులకుగాను జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వ విద్యాలయంతో కుదుర్చు కున్న ఒప్పందంతో ఈ కోర్సులను నిర్వహిస్తు న్నట్లు అయన మంగళవారం తెలిపారు. ఆర్బిట్రేషన్‌లో ఒక ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ కోర్సును ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియాలో వచ్చే ఆగస్టు మొదటివారం నుండి క్లాసులు ప్రారంభిస్తున్నట్లు, అలాగే సైబర్ సెక్యూరిటీ అనేది కూడా నేటి రోజుల్లో అత్యంత ప్రాధాన్యత గల కోర్సు కాబట్టి సైబర్ సెక్యూరిటీలో కూడా ఒక ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ కోర్సును కూడా ఆగస్టు నుండి ప్రారంభిస్తున్నట్లు కాలేజ్ డైరెక్టర్ రామేశ్వర్ రావు తెలిపారు. ఈ రెండు కోర్సులకు ఫీజు ఒక్కోదానికి ఒక లక్ష ఇరవై వేలు ఉంటుందని, రెండు కోర్సులకు కూడా ఫీజు వచ్చే నెల జులై 30వ వరకు కాలేజీ కార్యాలయంలో చెల్లించవచ్చన్నారు. అడ్మిషన్లు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆర్బిట్రేషన్ కోర్సులో చేరేవారు ఏదేని డిగ్రీ పూర్తి చేసివుండాలని, డిగ్రీ ఫైనల్ ఇయర్లో వుండే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అయిదేళ్ల ఎల్ఎల్బీలో కనీసం మూడేళ్లు పూర్తి చేసుకున్నవారు సైతం ఈ కోర్సులో చేరడానికి అర్హత కలిగివుంటారని డైరెక్టర్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో ఒక ఏడాది వ్యవధి గల సర్టిఫికేషన్ కోర్సులో చేరాలనుకునేవారు ఏదేని గ్రాడ్యుయేషన్ కోర్సులో కనీసం 50 శాతం మార్కులుండాలని, డిగ్రీ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఉపాధి లభించే ఈ కోర్సుల్లో చేరితే యువత లబ్ది పొందుతారని అభిప్రాయపడ్డారు. ఈ రెండు కోర్సులతో పాటుగా ఒక సంవత్సరం వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ మేనేజ్ మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మేనేజ్ మెంట్, ఇండిస్టియల్ సేఫ్టీతోపాటు ఎన్విరాన్మెంట్ కోర్సులను కాలేజ్ లోని స్కూల్ అఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్‌లో ప్రవేశపెట్టినట్లు ప్రస్తుతం వీటికి అడ్మిషన్స్ జరుగుతున్నాయని తెలిపారు.
జియోగ్రాఫికల్ ఇన్ఫర్ మేషన్ సిస్టమ్‌లో ఆరు మరియు నాలుగు వారాల స్వల్ప వ్యవధి గల కోర్సులను కూడా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా ప్రవేశ పెట్టడం జరిగిందని, ఆరు వారాల కోర్సుకు కోర్స్ ఫీజు రూ. 35వేలు కాగా, నాలుగు వారాల కోర్సుకు ఫీజ్ రూ. 25 వేలు చెలియించాల్సి ఉంటుందన్నారు. ఈ కోర్సులు బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తామని, అభ్యర్థుల డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులను నిర్వహిస్తామని అయన తెలిపారు. అన్ని వివరాలకు కాలేజ్ వెబ్ సైట్లో చూడవచ్చని లేదంటే కాలేజ్‌లో స్వయంగా సంప్రదించవచ్చని అయన తెలిపారు.