కొత్తగా 59వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగు

– మంత్రి తుమ్మల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్తగా 59వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పంట మార్పిడి ప్రాధాన్యత రీత్యా పామాయిల్‌, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం కేంద్ర వాటా రూ.80.10 కోట్లు, రాష్ట్ర వాటా రూ.53.40 కోట్లు కలిపి మొత్తం రూ.133.50 కోట్లు విడుదల చేశామని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సూక్ష్మ సేద్యానికి సంబంధించిన రూ.55.36 కోట్ల (2022-23) పెండింగ్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.