– ఆబ్కారీ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
– నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు
– విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా కొత్త మద్యం కంపెనీలకు ఎలా అనుమతినిచ్చారని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. అధికారుల స్వంత నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాయనీ, దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని తెలిపారు. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకురాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కొత్త మద్యం కంపెనీల అనుమ తులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమి షనర్ శ్రీధర్, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను మంత్రి ఆదేశించారు. నివేదిక తర్వాత దోషులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రేతలు, సప్లయర్ నెట్‌వర్క్ జాబితా తయారు చేయాలని సూచించారు. తరచుగా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కల్పించేం దుకు మీడియా, సోషల్ మీడియాతో పాటు థియేటర్లలో ఆడియో, వీడి యోల రూపంలో విస్తత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో తరుచూ సమావేశాలు నిర్వహించి, వారిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. అధి కారుల పని తీరును బట్టి ఇంక్రిమెంట్లు, రివార్డులు, బదిలీల్లో ప్రాధాన్యత నివ్వనున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్, అడిషనల్ కమిషనర్ అజరురావు, బ్రూవరీస్ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహం, ఉమ్మడి జిల్లాల డిఫ్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.