బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణకు రిమాండ్‌

– ప్రభుత్వ భూముల ఆక్రమణపై కేసు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం 41వ డివిజన్‌ కార్పొరేటర్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు కర్నాటి కృష్ణపై మంగళవారం ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్‌ ఐపిసి 420,427,447 పిడిపిపి యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. జీవో నెంబర్‌ 59 ద్వారా ప్రభుత్వ భూముల ఆక్రమణకు యత్నించినందుకు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడంపై ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ సీహెచ్‌ స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.