బడి బాట కార్యక్రమం ముగింపు.. బడిలో చేరాలని ర్యాలీ

నవతెలంగాణ – గోవిందరావుపేట
బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా బడిలో చేరాలని విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలో  మండల విద్యాధికారి  గొంది దివాకర్, మండల నోడల్ అధికారి సోమారెడ్డి  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పుర వీధుల్లో  బడి ఈడు పిల్లలు  బడిలో చేరా లంటు బారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల,ప్రైమరీ స్కూల్, విద్యార్థిని విద్యార్థులు  బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా మండల విద్యాధికారి దివాకర్, నోడల్ అధికారి సోమా రెడ్డి  ఆధ్వర్యంలో  వీదుల్లో తిరుగుతూ  కరపత్రాలు పంచుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేరాలని చెబుతూ బారీ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దివాకర్  మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమయ్యాయని, బడి ఈ డు పిల్లలు వుంటే బడిలో చేరాలని, ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల  భవితకు పునాదులు వేస్తుందని, మంచి విద్యా భోధన, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, డిజిటల్ క్లాసులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం లాంటి ఎన్నో వసతులు కల్పిస్తుందని తెలిపారు. నోడల్ అధికారి సోమారెడ్డి  ఉపాధ్యాయులుపాల్గొన్నారు.